13-09-2025 03:29:04 AM
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రం భీం ఆసిఫాబాద్,సెప్టెంబర్ 12(విజయక్రాంతి): జిల్లాలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండల, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఉపాధి హామీ పథకం ఏపీవోలు, సెర్ప్ ఏపీఎంలు, హౌసింగ్ శాఖ అధికారులతో పాఠశాలలలో చేపట్టవలసిన మౌలిక వసతుల కల్పన, మొక్కల పెంపకం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఎన్నికల సంబంధిత అంశాలు, గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్యం, త్రాగునీరు ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని అధికారులకు అదేశాలిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మహిళా సంఘాల నుంచి రుణాలు అందించాలని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నదీమ్, మండల విద్యాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.