04-10-2025 07:29:50 PM
మణుగూరు,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రకటించిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని ఆదివాసి సంక్షేమ పరిషత్ సంఘం మండల అధ్యక్షులు సోలం హరిశంకర్ అన్నారు. శనివారం సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతాల్లో రిజర్వేష్లను కూడా దోపిడీ చేసేలా కుట్రలు పన్ను తున్నారన్నారు. కొందరు గిరిజనేతరులకు అవకాశం కల్పించే రొటేషన్ పద్ధతితో ఆదివాసి హక్కులకు, చట్టాలకు భంగం కలుగుతుందన్నారు. తక్షణమే రిజర్వేషన్ నిలిపివేయాలన్నారు. ఎస్టీలకు సరైన రిజర్వేషన్ కల్పించకుంటే స్థానిక ఎన్ని కలను బహిష్కరిస్తామని తెలిపారు.