calender_icon.png 11 September, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజనంపై విచారణ కమిటీలు

06-12-2024 01:34:11 AM

  1. హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం 
  2. పౌష్టికాహారం పెట్టాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారం పెట్టాలని గురువారం హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. మధ్యాహ్న భోజన పథకాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించింది.

భోజనంలో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. నారాయణపేట జిల్లా మాగనూరు, కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై ౬ వారాల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందజేయాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత, ప్రమాణాలు లేవని, ప్రైవేట్ బడుల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించాలనే నిబంధనను ప్రభుత్వం అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీగురుతేజ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని డివిజన్ బెంచ్ గురువారం విచారించింది.

పిటిషనర్ తెలిపిన రెండు ఘటనలతోపాటు మరో రెండు చోట్ల కూడా మధ్యాహ్న భోజ నం తిని ఇబ్బందులు పడ్డ ఘటనపై ప్రభు త్వం చర్యలు తీసుకున్నట్టు అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ చెప్పా రు. ఆయా ఘటనల్లో బాధ్యులైన వాళ్లపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నారాయణపేట, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ల నేతత్వంలో వేర్వేరుగా రెండు కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు.

భోజనం వికటించిన ఘట నలపై కమిటీలు అధ్యయనం చేసి నివేదిక ఇస్తాయన్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజ నం శాంపిల్స్‌ని పరీక్షల నిమిత్తం పంపినట్టు వివరించారు. రాష్ట్రంలో 25,941 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మందికి పైగా విద్యార్థులన్నారని, ఇటీవల జరిగిన ఘటనల్లో 75 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురయ్యారని చెప్పారు.

ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కేంద్ర మార్గనిర్దేశకాల ప్రకారం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనాన్ని కట్టుదిట్టంగా అమలు జరపాల్సివుందని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వాదించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కమిటీల ద్వారా పక్కాగా పర్యవేక్షించాల్సి ఉందన్నారు.

అయితే, క్షేత్రస్థాయిలో ఆవిధంగా అమలు కావడం లేదని తెలిపారు. మధ్యాహ్నం  భోజనంలో నిబంధన ల ప్రకారం గుడ్డు ఇవ్వాలని చెప్పారు. అయితే, చాలాచోట్ల విద్యార్థులకు గుడ్డును ఇవ్వడం లేదన్నారు. తిరిగి ఏఏజీ ఖాన్ కల్పించుకుని, పిటిషనర్ చెప్తున్న ఆ కమిటీలకు అదనంగానే ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై అధ్యయనానికి మరో రెండు కమిటీలు ఏర్పాటు చేశామని కోరారు.

కమిటీల నిబంధనలకు అనుగుణంగా పని చేసి నివేదిక ఇస్తాయని తెలిపారు. వాదనల అనంతరం హైకోర్టు, ఆ కమిటీల నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.