calender_icon.png 31 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 4 నుంచి టీజీ ఎప్‌సెట్

31-12-2025 12:47:48 AM

  1.   4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ 
  2.   9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు
  3. మే 13, 14న ఐసెట్ 
  4. ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
  5. ఇంజినీరింగ్ ఫీజులపై త్వరలోనే స్పష్టత 
  6. విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్స్ (సెట్స్) షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుద ల చేసింది. టీజీ ఎప్‌సెట్‌తో పాటు ఎడ్ సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీజీఈసెట్, పీఈసెట్‌లకు సంబం ధించిన ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటిం చింది. ప్రవేశ పరీక్షలు మే 4న మొదలై జూన్ 3 వరకు నిర్వహించనున్నారు. తొలుత ఎప్‌సెట్ పరీక్ష ప్రారంభంకా నుంది. ఈసారి కూడా టీజీ ఎప్‌సెట్‌ను జేఎన్టీయూ హైదరాబాద్ వర్సిటీయే నిర్వహించనుంది. 


హాల్‌టికెట్‌పై జియోట్యాగింగ్..

తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం  ఏర్పా టుచేసిన మీడియా సమావేశంలో మం డలి చైర్మన్ ప్రొ.వి. బాలకిష్టారెడ్డి, కార్యద ర్శి శ్రీరామ్ వెంకటేశ్ కలిసి ప్రవేశ పరీక్ష ల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడు తూ.. గతేడాదిలాగానే ఈసారి కూడా ఎప్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించడానికి ముందు మాక్ కౌన్సెలింగ్‌తో పాటు పరీ క్షా కేంద్రాలకు అభ్యర్థులు సులువుగా చేరుకునేలా హాల్‌టికెట్‌పై జియో ట్యాగింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

కంప్యూటర్ బేస్డ్ విధానంలో పకడ్బందీగా, పారదర్శకంగా పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. పరీక్ష ఫీజుల్లో ఎలాంటి మార్పులు లేవని, పాత ఫీజులనే ఈసారి కూడా వసూలు చేస్తామని వెల్లడించారు. దరఖాస్తు తేదీ, విద్యార్హతలు, పరీక్షా ఫీజు తదితర వివరాలతో కూడిన డిటైల్డ్ నోటిఫికేషన్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇక ఇంజినీరింగ్ ఫీజుల అంశంపై త్వరలోనే స్పష్టత రానుందన్నారు. 

ఇదిలా ఉంటే ఈసారి అగ్రికల్చర్ ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షల మధ్య మూడు రోజులు గ్యాప్ వచ్చింది. వచ్చే ఏడాది మే 4, 5వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలుండగా, 9, 10, 11వ తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యలో ఆ మూడు రోజులు కొన్ని జాతీయ పరీక్షలు, సెలవు దినాలుండటంతో గ్యాప్ ఇచ్చారు.