31-12-2025 12:52:17 AM
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి ఏరియాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని అధి కారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయాలని కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం సూచించారు.
హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ విభాగం అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నామని, క్యూర్ పరిధిలోని సిటీని 12జోన్లు, 60సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వవ్యవస్థీకరించామన్నారు.
పరిపాలనను పట్టాలెక్కించాలనేదే ప్రభుత్వ ఆలోచన అని, అత్యంత సంక్లిష్టమైన సమ స్య చెత్త నిర్వహణ అన్నారు. కోర్ అర్బన్ రీజియన్‌ను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని, జోన్‌ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్‌లదేనని సూచించారు. జోనల్ కమిషనర్లు ప్రతీ రోజు ఫీల్డ్‌లో ఉండాల్సిందేనని, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిం చాలన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలని ఆదేశించారు.
‘డీజిల్’ స్థానంలో ఈవీ వెహికిల్స్
క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ వెహికిల్స్‌ను తీసుకురావాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. సిటీ లో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన తీసుకుంటున్నామని, చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయా లన్నారు. నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదు.. రోడ్లపై గుంతలు కనిపించొద్దని ఆదేశించారు.
జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని, టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్ మెంట్ అసోసియేషన్‌లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలన్నారు. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలని తెలిపారు.
హైడ్రా, జీహెచ్‌ఎంసీ, వాట ర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలని, వీధి దీపాలు సరిపడా ఉండేలా చూసుకోవాలన్నారు. క్యూర్ ఏరియాలో విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారన్నారు. దోమ ల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని, ప్రతీ పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు వీలైనంత స్పీడ్‌గా రెస్పాన్స్ కావాలని ఆదేశించారు.