31-12-2025 12:58:28 AM
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచ్‌లకు ముదిరాజ్ కో ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్, ముదిరాజ్ సమన్వయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఘనం గా సన్మానించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరితోపాటు ముదిరాజ్ సంఘాల నాయ కులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన దాదాపు 680 మంది సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లను సన్మానించారు. ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎంపీ ఈటల రాజేందర్ ముదిరాజ్, శాసనమండలి ఉపసభాపతి బండా ప్రకాష్ ముదిరాజ్, పల్లె బోయిన అశోక్ జీఎస్ (ముదిరాజ్ మహాసభ) తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ కులాన్ని బీసీ డీ నుంచి ఏలోకి మార్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకో వాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.