22-11-2025 09:41:47 PM
రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలం లొంక కేసారం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులు నిర్మిస్తున్న పశువుల షెడ్ల పనులను శుక్రవారం ఇంచార్జీ ఏపీఓ, ఈసీ మౌనిక ఆకస్మికంగా పరిశీలించారు. పాడి పశువుల పెంపకానికి అనువుగా గోకులం షెడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చేపట్టిందన్నారు. షెడ్ల నిర్మాణానికి రాయితీ ఇస్తూ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. పంచాయతీ కార్యదర్శి మహేందర్, ఉపాధి హామీ సిబ్బంది అఖిల, రైతులు పాల్గొన్నారు.