22-11-2025 09:41:45 PM
కోయిలకొండ: మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు కీర్తిశేషులు అయ్యనుల చంద్రకళ జ్ఞాపకర్తంగా వారి భర్త అయ్యనుల సుభాష్ గౌడ్ కూతురు శ్రీలత నిరంజన్ గౌడ్ ఇబ్రహీంనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్నం ప్లేట్లు, ఒక సౌండ్ మ్యూజిక్ బాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అయ్యనోళ్ళ వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.