12-10-2025 01:48:13 AM
పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
రంగారెడ్డి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ నియోజకవర్గం లోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి శనివారం తనిఖీ చేశారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్ర స్థాయి సందర్శన జరిపారు.
ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట రాజేందర్ నగర్ తహశీల్దార్, వేర్ హౌస్ ఇంచార్జీ రాములు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.