calender_icon.png 5 November, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

05-11-2025 12:21:18 AM

చౌటుప్పల్, నవంబర్ 4(విజయక్రాంతి): చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఊర చెరువు అలుగు పోయడంతో జాతీయ రహదారి సర్వీస్ రోడ్ పక్కన రోడ్డుపై నుంచి పారుతున్న వరద నీరు లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా వరద నీరును పరిశీలించి నీటిని మళ్లించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అధిక వర్షాలతో చెరువులన్నీ  నిండుకుండలా మారి పడ్డ చినుకు పడ్డట్టే వరద రూపంలో కిందికి వస్తుంది కాబట్టి చెరువులు నిండిన తర్వాత వచ్చే వరదతో గతంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎడమవైపు ప్రాంతమంతా  వారం రోజులపాటు నీటిలోనే ఉండేది .ఈ వరద ముప్పును ముందే ఊహించి వరదరాకుండా డైవర్షన్ చేయడం వల్ల ఆ వరద  ప్రభావం తగ్గింది. అలాగే నేషనల్ హైవే అథారిటీ  సర్వీస్ రోడ్డు పక్కన డ్రైను నిర్మించడం వల్ల కాలనీలో పడిన భారీ వర్షాల నీరు కిందికి రాకుండా డ్రైన్   అడ్డంకిగా మారడం వల్ల నీరు సర్వీస్ రోడ్డుపై నిలవడంతో  వెంటనే స్థానిక ఆర్డిఓ ,మున్సిపల్ అధికారులతో కలిసి  వరద నీరు, డ్రైనేజీ నీరు ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా  సాఫీగా  వెళ్లేలా చర్యలు తీసుకోవాలని  అన్నారు.