calender_icon.png 2 July, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకెన్నాళ్లు నిరీక్షణ?

02-07-2025 12:00:00 AM

- డీసీసీ పీఠం కోసం ఆశావహుల ఎదురుచూపు

- తమకే వస్తుందని ఎవరి నమ్మకం వారిదే

-పనిచేసే వారికి అంటూ అధిష్ఠానం ఊరింపు 

- స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనేఉండేఅవకాశం

మహబూబ్ నగర్ జూలై 1 (విజయ క్రాంతి) : ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్న డి సిసి పీఠం మాత్రం కొత్తవారికి దక్కడం లేద ని నిరాశ ఆశావాహుల నేతల్లో ఎదురవుతుంది. అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వె ల్లదీస్తున్న రాష్ట్ర అధిష్టానం మహబూబ్ నగ ర్ డిసిసి అధ్యక్షుడు ఎవరు అనేది మాత్రం తేల్చడం లేదు. డిసిసి అధ్యక్షులుగా, దేవరక ద్ర ఎమ్మెల్యేగా జి మధుసూదన్ రెడ్డి సమర్థవంతంగా పార్టీ కార్యక్రమాలను చేస్తున్నప్ప టికీ డిసిసి పీఠం ఎవరికి దక్కుతుందనే అం శం మాత్రం పక్కదోవ పట్టడం లేదు.

బీసీ సామాజిక వర్గాల్లో డీసీసీ పీఠం ఉంటుందని మరొకరు ప్రచారం చేస్తుండగా మైనార్టీ ఇ తర వర్గాలలో కూడా డిసిసి అధ్యక్షులు అయ్యే అవకాశాలు మెం డుగా ఉన్నాయని జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతుంది. స్థానిక సంస్థల ఎన్ని కలు నిర్ణీత కాల వ్యవధిలో నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వు లు జారీ చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి తర్వాతనే డిసిసి పీఠం కేటా యింపు ఉంటుందని ఆశావాలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. 

-స్థానిక సంస్థలలో పనితీరుపైనేనా...?

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో డీసీ సీ పీఠంపై ఆశ పెట్టుకున్న నేతలు ఏ మేరకు తమ ప్రయత్నాలు చేస్తారు.. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలబడుతున్న అభ్యర్థులను గెలిపించుకుంటారు ? అనే విషయాలు రాష్ట్ర అధిష్టానం పరిగ ణలోకి తీసుకొని అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో డి సిసి పీఠంపై నమ్మకం పెట్టుకున్న నేతలు జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన కు మరింత పట్టు సాధించేలా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చర్చ జరు గుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఉండడంతో డిసిసి పీఠం ఆశించే నేతలు కూడా ఇ టువైపు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో నేతలు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో.. అంతే మాట్లాడుతూ అధిష్టానం అ మలు చేస్తున్న విధానాలను సవిధానంగా అధ్యయనం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ ఎక్కడ ఎలాంటి వ్యతిరేకత రాకూడదని ముందు జాగ్రత్తతో మెలుగుతున్నారు. 

-సమిష్టి నిర్ణయాలతో ముందుకు...

సమిష్టి నిర్ణయాలతో తాము ఎల్లప్పుడూ ముందు ఉంటామని ఆశవాహులు మరో అడుగు ముందుకేసి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర మంత్రిగా వాకిటి శ్రీ హరి బాధ్యతలు చేపట్టడంతో బీసీ నేతల్లో జిల్లా వ్యాప్తంగా కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో ఒక దశలో డిసిసి కూడా బీసీనే అవుతారా..? ఇతర సామాజిక వర్గాలకు సంబం ధించిన నేతకే పట్టం కడతారా..? అనే సందేహాలకు తీవ్ర చర్చ జరుగుతుంది. ఏది ఏమై నా మహబూబ్ నగర్ డిసిసి పీఠం ఎవరికి దక్కుతుందో అనే అంశంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల్లో చర్చ తీవ్రంగా జ రుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు నియోజకవర్గాలకు సముచిత న్యాయం కలిపిస్తూ అందర్నీ కలుపుకో ఇది పోయి పార్టీని మరింత ఉన్నత స్థాయి తీసుకుపోయే వ్యక్తికి డిసిసి పీఠం కట్ట పెట్టాలని అధిష్టానం చూ స్తుందని పలువురు నేతలు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఈ ప్రక్రియ జరుగుతుందా..? పూర్తి అయిన తర్వాత జరుగుతుందా అనే సందేహం. ? మరింత ఊ పండుకుంటుంది.