calender_icon.png 2 July, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లపై కాంగ్రెస్ మొద్దునిద్ర

02-07-2025 12:20:11 AM

  1. మేల్కొలిపిందే బీఆర్‌ఎస్ 
  2. మిగులజలాలపై సీఎంకు జ్ఞానోదయం చేశాం
  3. ఎమ్మెల్యే హరీశ్‌రావు

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్లపై కాంగ్రెస్‌ను మొద్దునిద్ర లేపిందే బీఆర్‌ఎస్ పార్టీ అని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతు లు తిరస్కరించే వరకు బీఆర్‌ఎస్ అలుపెరగని పోరాటం చేసిందని మంగళ వారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన పే ర్కొన్నారు.

గోదా వరిలో 1,000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాల ని చెప్పిన రేవంత్‌కి, మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేశామన్నారు. సీఎం అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. పంట బీమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి, నాలుగు సీజన్లుగా పంట బీమా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని హరీశ్‌రావ్ ఎక్స్‌లో ధ్వజమెత్తారు.

ఎన్నికలు వస్తే హామీ లు గుప్పించడం, అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపడం హస్తం పార్టీకి అలవాటేనని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు పంటల బీమాకు అతీగతీ లేకపోవడం కాంగ్రెస్ మార్క్ రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమన్నారు. మరోవైపు యూరియా కొరత వేధిస్తున్నా ప్రభుత్వానికి ఉలుకుపలుకులేదన్నారు.

పేదలు, మధ్య తరగతి ఇండ్లపై హైడ్రా అరాచక రాజ్యం కొనసాగించడం దుర్మార్గమని హరీశ్‌రావు విమర్శించారు. హై కోర్టు స్టే ఉన్నా, హైదరాబా ద్‌లో గుట్టల బేగంపేటలో ఇళ్ల కూల్చివేతకు పాల్పడటం న్యాయవ్యవస్థను అవమానించడమే అని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. భారీగా పోలీసు బందోబస్తు నడుమ, హైడ్రా అధికారులు ఒక్క ఇంటిని కూడా వదలకుండా నేలమట్టం చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు.