27-09-2025 12:24:31 AM
కాప్రా, సెప్టెంబర్ 26(విజయక్రాంతి) : చర్లపల్లి డివిజన్లో కురుస్తున్న వర్షం కారణంగా కృష్ణరెడ్డి నగర్, సాయి నగర్ మెయి న్ రోడ్ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ సంబంధిత అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. స్థానిక ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వెంటనే స్పందించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.