calender_icon.png 27 September, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఇంటికి సంక్షేమ పథకం

27-09-2025 12:24:16 AM

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

చిన్న చింత కుంట, సెప్టెంబర్ 26: ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందిస్తుంది ప్రజా పాలన ప్రభుత్వమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తమ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు మబీనా బేగం కి మొబైల్ క్యాంటీన్ వాహనాన్ని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు.

దేవరకద్ర మండలం మినిగొని పల్లి గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ వెంకటయ్య, మైబు , శీను , గోవర్ధన్ రెడ్డి పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే శ్రీ. జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కం డువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అవ్వనించి మాట్లాడారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.