14-08-2025 02:14:09 AM
గ్లెన్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల ఘనత
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): 79వ స్వాతంత్య్ర దినోత్స వాన్ని పురస్కరించుకుని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గ్లెన్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థు లు తమ పాఠశాల గోడలను సామాజిక సందేశాలు, సాంస్కృతిక కథనాలతో నిండిన శక్తివంత మైన కుడ్యచిత్రాలుగా మార్చారు.
‘వికసిత్ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, ఈ ఉత్సాహభరితమైన కళాకృతు లు భారతదేశ ప్రయా ణాన్ని - గతం, వర్తమానం, భవిష్యత్తును - భావి పౌరుల మది లో చెరిగిపోని విధంగా ముద్రించాయి. ‘వికసిత్ భారత్ కథలు: నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్’ అనే శీర్షికతో చేపట్టిన ఈ చొరవలో 6 నుండి 10వ తరగతి వరకు చదవుతున్న 20 మందికి పైగా విద్యార్థులు కలిసి భారతదేశ సాంస్కృతిక వారసత్వం, శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం సాధించిన పురోగతిని ప్రతిబింబించే కుడ్యచిత్రాలను చిత్రించారు. వాటి మధ్యలో ప్రధానమంత్రి చిత్రపటాన్ని ప్రదర్శిస్తాయి.
గరీబి (పేదరిక నిర్మూలన), యువ (యువత సాధికారత), నారి (మహిళా సాధికారత), కిసాన్ (రైతు సంక్షేమం). ఈ చొరవ గురించి గ్లెన్డేల్ స్కూల్స్ ఇండియా డైరెక్టర్ మిను సలూజా మాట్లాడుతూ.. “మా పాఠశాల గోడలు ఇప్పుడు భారతదేశ గొప్ప వారసత్వం, అజేయ స్ఫూర్తి, వికసిత్ భారత్గా మారడానికి చేస్తున్న తిరుగులేని ప్రయాణం గురించి చాలా మాట్లాడుతున్నాయి” అన్నా రు. 9వ తరగతి విద్యార్థి అద్వైత కొల్లి మాట్లాడుతూ.. “ఈ రోజు మనం మన స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరులను స్మరించుకోవడమే కాకుండా, భారతదేశం అప్పటి నుండి సాధించిన ప్రతి ఘనతను కూడా వేడుక చేసుకుంటాం” అన్నారు.