09-05-2025 01:37:32 AM
కరీంనగర్, మే 8 (విజయ క్రాంతి): దేశాన్ని , సైనికుల సాహసాన్ని కించపరుస్తూ ‘ఆపరేషన్ సింధూర్‘ ను ఎగతాళి చేసే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనికోరుతూ గురువారం బిజెపి శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం అత్యంత సాహసోపేతంగా ఆపరేషన్ సింధూర్ పేరిట దాయాది దేశంలోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తే, ఆపరేషన్ సింధూర్ పేరిట దాయాది దేశంలోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తే, దానిని తప్పుబట్టేవిధంగా ప్రొఫెసర్ సుజాత వ్యవహరించడం దుర్మార్గమని, ఇది ముమ్మాటికి దేశద్రోహమేనని తెలిపారు.
వెంటనే ఆమెపై చట్టబనవ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు , మాజీ డిప్యూటీ మేయర్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ళపు రమేష్, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వేణు ప్రసాద్, నాయకులు లడ్డు ముందడ, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహిళా మోర్చా ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
దేశ ప్రజల మనోభావాలు దెబ్బ తినే విధంగా, సైనికుల సాహసాన్ని కించపరిచేలా ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజెపి మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాళ్ళు, తదితరులు పాల్గొన్నారు.