26-11-2025 12:19:39 AM
మహిళా శక్తితో జిల్లా అభివృద్ధి వేగవంతం అవుతుంది: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 25, (విజయక్రాంతి):మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొత్తగూడెం క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్బంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రూ.304 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు విడుదల కావడం మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందన్నారు.
రుణాలను క్రమశిక్షణతో తిరిగి చెల్లించడం వ్యాపార దక్షతను పెంపొందిస్తుందని, పెట్రోల్ బంకులు, బస్సులు, సోలార్ ప్లాంట్లు వంటి రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ చీరల పంపిణీ సందర్భంగా మహిళలో కనిపించిన సంతోషం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూ లంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చే స్తున్న ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, రేషన్ కార్డుల మంజూరు, రైతు భరో సా, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపే తం చేస్తున్నాయని అన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, మాట్లాడుతూ.. జిల్లాకు మొత్తం రూ.10 . 74 కోట్ల విలువైన వడ్డీ లే ని రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అశ్వరావుపేటకు రూ.2.70 కోట్లు, భద్రాచలంకు రూ.1.51 కోట్లు, కొత్తగూడెం కు రూ.1.97 కోట్లు, పినపాక రూ.2.66 కో ట్లు, ఇల్లందుకు రూ.1.38 కోట్లు కేటాయించ గా, మొత్తం 11,423 మహిళా సంఘాలకు లబ్ది చేకూరిందని వివరించారు. రుణాలను సమర్థవంతంగా వినియోగించుకొని కొత్త పరిశ్రమలను స్థాపించి మహిళా కుటుంబా లు ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు.
జిల్లా వైపు రాష్ట్ర, జాతీయ స్థాయి పరి శ్రమలు ఆసక్తి గా చూస్తున్న నేపథ్యంలో మ హిళా సంఘాలు కొత్త సాంకేతిక పద్ధతుల ను, ప్రయోగాత్మక యూనిట్లు, మరిన్ని ఏ ర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇటీవల జిల్లాకు లభించి న ‘జల్ సంచయ్‌జన్ భాగీదారీ’ జాతీయ అ వార్డు మహిళా సంఘాల సమిష్టి కృషి ఫలితమే అని కలెక్టర్ అన్నారు. మహిళ సమాఖ్య సభ్యులు పలుగు పార పట్టి ఇంకుడు గుం తలు త్రవ్వడం ద్వారానే ఇది సాధ్యమైంది అన్నారు.
అదేవిధంగా, అమ్మ ఆదర్శ కమిటీ ల ద్వారా జిల్లాలోని అన్ని పాఠశాలల మరమ్మతులు పూర్తి చేసామని, పాఠశాలలలో శానిటేషన్ కోసం కూడా నిధులు విడుదల చేయడం జరుగుతుందని అమ్మ ఆదర్శ కమిటీ పర్యవేక్షణలో పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.ఇంటి ఆవ రణలో చిన్న యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా మహిళలు మంచి ఆదాయం ఆర్జించవచ్చని, బ్యాంకుల నుండి అవసరమైన సహకారం అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో 50 శాతం అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో అటవీ ఉత్పత్తుల ఆధారంగా మరిన్ని యూ నిట్లు స్థాపించేందుకు మహిళలు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు.
ఫర్నిచర్ తయారీ శిక్షణలో మహిళల అధిక పాల్గొనడం మహిళా శక్తి ప్రతిభకు సాక్ష్యమని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు కొత్తగూ డెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో సహకార సంఘ అధ్యక్షులు మండే హనుమంతరావు, మాజీ డిసిసిబి చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కొత్త గూడెం తాసిల్దార్ పుల్లయ్య,అదనపు డి ఆర్ డి ఏ నీలేష్ డ్వాక్రా సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.