calender_icon.png 26 November, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

26-11-2025 12:20:49 AM

- వేములవాడ బస్ డిపో దగ్గర డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పరిశీలిస్తుండగా ఒకసారిగా కుంగిన బేస్మెంట్ 

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 25 (విజయక్రాంతి): వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తృటిలో ప్రమాదం తప్పింది. వేములవాడ బస్సు డిపో దగ్గర నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించేందుకు వచ్చారు.ఈ క్రమంలో ఓ డబల్ బెడ్ రూమ్ ఇంటి సముదాయం లోకి అడుగుపెట్టగా వెంటనే ఫ్లోరింగ్ కూరుకుపోయింది.

అప్రమత్తమైన మిగతావారు ప్రభుత్వ విప్ ను పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రక్కన ఉన్న జిల్లా కలెక్టర్ కు కూడా ప్రమాదం తప్పింది. ప్రమాదం అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాములో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ను నాణ్యత లోపంతో నిర్మించారని ఆరోపించారు.

గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగి నాణ్యత లోపించి కూలిపోగా వేములవాడలో మూలవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జితోపాటు డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో అప్పటి ప్రభుత్వం లో కాంట్రాక్టర్లు నాణ్యత లేకుండా నిర్మించడం వల్లనే గత కొన్ని రోజుల క్రితం బ్రిడ్జి కూలిపోగా,నేడు ఫ్లోరింగ్ కుంగిన సంఘటన జరిగిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో వాటిని నాణ్యతతో తిరిగి నిర్మిస్తామని అన్నారు.