calender_icon.png 5 November, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మాట తప్పని ప్రభుత్వం

04-11-2025 09:59:28 PM

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ..

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు..

చర్ల (విజయక్రాంతి): స్థానిక రైతు వేదిక ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తెల్లం వెంకటరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఇచ్చిన మాట నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తుందన్నారు.

భద్రాచలం నియోజకవర్గం మొత్తం ౩,5౦౦ ఇళ్లు మంజూరు కాగా ఐటీడీఏ వారి పరిధిలో మరొక వెయ్యి ఇళ్లను మంజూరు చేయడం జరిగినదని ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ద్వారా ఎంపిక చేసిన ఇళ్ళు అన్ని కులాల వారు మతాలవారు పార్టీలకు సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని ఐటీడీఏ వారి పరిధిలో ఇళ్ల ఎంపిక మాత్రం కేవలం గిరిజనులకు మాత్రమే ఎంపిక చేయడం జరిగిందని ఆర్థికంగా వెనుకబడిన గిరిజనులకు ఐటిడిఏ ద్వారా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారని దానిలో భాగంగానే మంగళవారం ఐటిడిఏ వారి ఎంపిక చేసిన గిరిజనులకు చర్ల మండలంలో 294 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని మొత్తం కలిపి నియోజకవర్గంలో 4,500 ఇళ్లు మంజూరు అవుతున్నాయని ఇళ్లను దశలు వారీగా లబ్ధిదారులకు పట్టాలు అందజేయడం జరుగుతుందని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బేస్ మట్టానికి లక్ష రూపాయలు, స్లాబ్ కి లక్ష రూపాయలు చొప్పున రెండు లక్షల రూపాయలను మంజూరు చేయుటకు 400 స్క్వేర్లు తగ్గకుండా 600 స్క్వేర్లు పెరగకుండా చూసుకున్నట్లయితే అధికారులు వచ్చి తనిఖీలు చేసి నేరుగా ఆన్లైన్ చేసి లబ్ధిదారులకు డబ్బులు జమ చేయడం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ నెలలో మరొక 3500 ఇళ్లు మంజూరు అయ్యే అవకాశం ఉన్నదని, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు రానివాళ్లు డిసెంబర్ లో కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి వారి అభివృద్ధికి చేయూతనిచ్చే ప్రభుత్వమని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఈదయ్య,ఎంపీ ఓ మహమ్మద్ హాజరత్ వలీ , పీఏసీఎస్  చైర్మన్ పరుచూరి రవి,  మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు , అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.