calender_icon.png 16 May, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

16-05-2025 12:37:41 AM

నిజామాబాద్, మే 15 (విజయ క్రాంతి): 2024-25 విద్య సంవత్సరం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో సంబంధిత  వివిధ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను  ఇంటర్ విద్య అధికారి శ్రీ రవికుమార్ తో అదనపు కలెక్టర్  సమీక్షించారు.

ఈ సందర్భంగా  అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, మే నెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు  మొత్తం18,837 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పరీక్షలు ప్రారంభం అయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయినుంచిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్  తెలియజేశారు. 

పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, తగిన సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.   మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో సీ. సీ. కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు.

వేసవి దృశ్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బం దులు కలవకుండా మంచినీటి వసతి తో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే వైద్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రథమ చికిత్స నిర్వహణ కోసం ఏర్పాట్లు, కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తామన్నారు.  సమావేశంలో  జిల్లా విద్యాశాఖ అధికారి,  ట్రాన్స్ కో, పోస్టల్, రెవెన్యూ వివిధ శాఖల అధికారులు,  అడిషనల్ పోలీసు కమిషనర్ బస్వారెడ్డి,  ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య,  కనక మహాలక్ష్మి పాల్గొన్నారు.