calender_icon.png 16 May, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17న జాబ్ మేళా..

16-05-2025 12:38:15 AM

గద్వాల, మే 15 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈనెల 17వ తేదీ (శనివారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక వ్యవసాయ మా ర్కెట్ యార్డులో గల ప్రభుత్వ ఐటిఐ నందు శనివారం ఉదయం 10:00 గంటలకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, జాబ్ మేళాలో ప్రముఖ కేఎల్ గ్రూప్ వారి ఎస్.కె. సేఫ్టీ వింగ్ వారు పాల్గొని తమకు అవసరమైన అభ్యర్థులను ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు. 

పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ డిప్లమా గల బాల బాలికలు జాబ్ మేళాలో పాల్గొని తమ అర్హతల మేరకు ఉపాధి అవకాశాలు పొందవచ్చుని తెలిపారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక ప్రతి జిరాక్స్ కాపీలను తీసుకురావాలని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 91105 23925,  83414 41763 సంప్రదించాలన్నారు.