16-05-2025 12:36:39 AM
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
కల్వకుర్తి, మే 15: కాలంలో బిఆర్‌ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలా మూ డు ముక్కలు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోందని చేతనైతే అది జరగకుండా చూసుకోవాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. గురువారం పటంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ జిల్లా రాములు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ తో కలిసి మీడియా సమావేశాన్ని ఏ ర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమ ముసుగులో గద్దెనెక్కి పదేళ్లు పాలించిన కెసిఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచు కుని ప్రజా ఆగ్రహానికి గురై ఓటమి చెందారని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీపై బిఆర్‌ఎస్ ము ఖ్యులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ప్రస్తుతం హరీష్ రావు మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోందని అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీపై విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులను ఏమాత్రం పట్టించుకోలేద ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిర సౌరగిరి జల వికాస పథకాన్ని 12.6 కోట్ల నిధులతో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అచ్చంపేటలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయాలో తెలుసునని పేర్కొన్నారు.