18-12-2025 06:14:09 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మామడ మండలం, న్యూ సాంగ్వి గ్రామంలో నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ఏజెంట్లకు అవగాహన కల్పించారు. గల్ఫ్ దేశాలు వెళ్లే ప్రతి కార్మికుడు శిక్షణ పొంది సర్టిఫికెట్ కలిగి, బీమా పాలసీ చేయించుకొని వెళ్లి, క్షేమంగా తిరిగివచ్చినప్పుడే కుటుంబానికి, దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశ్విన్ రెడ్డి, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి అనసూయ, వార్డ్ మేంబర్లు, యూనియన్ కోఆర్డినేటర్ కొమ్ము గీత, నాయకులు సుశీల, గంగాధర్, రాజేశ్వర్ పెద్ద ఎత్తున గల్ఫ్ కుటుంబాల సభ్యులు, గల్ఫ్ రిటర్నిలు, గ్రామస్థులు పాల్గొన్నారు.