18-12-2025 06:16:59 PM
సుల్తానాబాద్ శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): శివపార్వతుల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ అన్నారు, గురువారం శివాలయంలో మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు, కాసం సత్యనారాయణ లిఖిత దంపతులు, తొడుపునూరి విజేందర్ కవిత దాంపతులు స్వామి వారికి పలు రకాల పండ్లతో రుద్రాభిషేకం చేయడం జరిగింది.
సిరిపురం సాయిరాం మౌనిక దంపతులు 12 మాస శివరాత్రులు అన్న పూజా కార్యక్రమం చేయడం జరిగింది, వారికి అన్నపూర్ణాదేవి ఎల్లవేళలా అనుగ్రహం ఉండాలని శివాలయం భక్త బృందం కోరుకోవడం జరిగింది. మాస శివరాత్రి సందర్భంగా అల్లంకి సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు, కాసం సత్యనారాయణ లిఖిత దంపతులు శ్రీ రాజరాజేశ్వర స్వామి పల్లకి సేవ అంగరంగ వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. ఆకుల సందీప్ అంజలి దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా స్వామివారి శేష వస్త్రాన్ని అందించి ఆశీర్వదించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వల్ల కొండ మఠం మహేష్, రజిత అమ్మవారు, శివాలయం భక్త బృందం పాల్గొన్నారు.