02-09-2025 12:39:39 AM
-కెనడాలో వైభవంగా నారసింహుడి కళ్యాణోత్సవం
-హాజరైన కెనడా ప్రధాని మార్క్‌కార్ని
-పూజలు, సేవలకు అభినందన
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట క్ష్మీనరసింహస్వామి పూజా కార్యక్రమాలు, సేవలను కెనడా ప్ర ధాని మార్క్‌కార్ని లేఖ ద్వారా అభినందించా రు. కెనడా రాజధాని ఓట్టాయా నగరంలో వైభవంగా జరిగిన లక్ష్మీ నరసింహుడి కళ్యాణోత్సవంలో కెనడా దేశ ప్రధాని మార్క్ కార్ని పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులతో ఆలయ ఈవో ఎస్ వెంకట్రావు, ఆలయ ఏఈవో గజవెల్లి రఘు కలిసి రిటైర్డ్ ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్ నరసింహాచార్యులుచే లక్ష్మీనరసింహస్వామి వా రి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచారకుడు, మాజీ ఎంపీ ఆర్య చంద్ర, పాపల కరు ణాకర్‌రెడ్డి, తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్యం పాల్గొన్నారు. కెనడాలో నివసిస్తున్న భారతీయులందరూ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి తన్మయత్వం చెందారు. కెనడా పౌ రులు కూడా పాల్గొని ఒట్టాయా నగరంలో ఒక కొత్త భక్తి ప్రపంచాన్ని ఏర్పాటు చేశారు.