calender_icon.png 29 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం

29-09-2025 12:30:04 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 28, (విజయక్రాంతి):అంతర్జాతీయ సాంకేతిక భాషా దినోత్సవ వేడుకలు ఆదివారం ఐడిఓసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనిన కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సంకేత భాష పోస్టర్ ను ఆవిష్కరించారు .

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందన్నారు. సొసైటీలో బధిరులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యా, ఉద్యోగాలలో బధిరులకు న్యాయం జరిగేలాగా చూస్తామని , అర్హులైన అందరికీ సహాయ ఉపకరణాలు అందిస్తామన్నారు. వారి సమస్యలు ఏమున్నా తెలియ జేసినట్లయితే జిల్లా కలెక్టర్, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బదిరుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి మాట్లాడుతూ బదిరులు ఎక్కడికి వెళ్లినా సంకేత భాష విషయంలో తమ సమస్యను పక్క వారికి చెప్పుకోలేక బాధలు పడుతున్నారని, అధికారులు అందరికీ సైగల భాష పై అవగాహన కల్పించాలని, రవాణాశాఖ ద్వారా బధిరుల కు డ్రైవింగ్ విషయంలో లైసెన్స్ మంజూరు చేపించాల ని, వికలాంగుల నియామకాలు రిజర్వేషన్లను భర్తీ చేయాలని, బధిరుల కు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, మహిళలకు కుట్టుమిషన్ ,

కంప్యూటర్ శిక్షణలు ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బధిరుల సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కిషన్, ఖమ్మం జిల్లా అసోసియేషన్ ఆఫ్ డెఫ్ అధ్యక్షుడు వీరస్వామి, సెక్రటరీ మహేష్ కుమార్ భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా బదిరుల సంఘం సెక్రటరీ ఇంతియాజ్ ఖాదర్, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ ప్రసన్న ప్రియ , అనువాదకులు అంకిత,కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.