calender_icon.png 30 July, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరికొత్తగా చిరు గ్యాంగ్ పరిచయం

02-04-2025 12:00:00 AM

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు అనిల్ రావిపూడి ఉగాది రోజు సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘మెగా157’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రారం భమైందీ ప్రాజెక్టు. ఈ చిత్రంపై అభిమానులు, ప్రేక్షకుల అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విడుదల తేదీ సమీపిస్తుందనగా తనదైన శైలిలో ప్రచార పర్వానికి తెర తీశాడు అనిల్ రావిపూడి.

ఇప్పుడు ‘మెగా157’ విషయంలో మరో అడుగు ముందుకేసి, ఆరంభం నుంచే విభిన్నమైన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చిరంజీవి కెరీర్‌లోని ఐకానిక్ పాత్రలతో ఒక వీడియోను రూపొం దించడం ద్వారా ‘మెగా157’ మూవీ టీమ్‌ను పరిచయడం చేయడం ఆకట్టుకుంది. ఈ ప్రమోషనల్ వీడియో ప్రకారం.. అజ్జు మహాకాళి, తిరుమల నాగ, ఉపేంద్ర, నారాయణ ఈ సినిమాకు రచనా విభాగంలో పనిచేయనున్నారు.

రచయిత ఎస్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, సమీర్‌రెడ్డి డీవోపీగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్‌గా, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. చివరగా ఈ వీడియోలో తమ సినిమా 2026 సంక్రాంతికి విడుదల చేయనున్న విషయాన్ని ప్రకటిస్తూ ‘రప్ఫాడిద్దాం’ అనే డైలాగ్‌తో ఆకట్టుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.