calender_icon.png 20 May, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బషీర్‌బాగ్‌లో ఐఎన్టీయూసీ నేతల బాహాబాహి

20-05-2025 02:00:41 AM

  1. అంబటి కృష్ణమూర్తిపై సంజీవ్‌రెడ్డి అనుచరుల దాడి
  2. నాపై దాడి.. మొత్తం కార్మికవర్గంపై జరిగిన దాడి
  3. ఐఎన్టీయూసీతో సంజీవ్‌రెడ్డికి సంబంధం లేదు
  4. జనక్ ప్రసాద్ ఆరోపణలను ఖండిస్తున్నాం
  5. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి

ముషీరాబాద్, మే 19: బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఐఎన్టీయూసీ నేతలు బాహాబాహికి దిగారు. మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చిన ఐఎన్టీయూసీ(ఆర్) జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణ మూర్తి, ఇతర నాయకులపై జీ సంజీవ్‌రెడ్డి వర్గానికి చెందిన ఐఎన్టీయూసీ నాయకులు ఆర్‌డి చంద్రశేఖర్, ఆదిల్ షరీఫ్, నరసింహారెడ్డి తదితరులు అసభ్య పదజాలంతో దూషి స్తూ కృష్ణమూర్తిపై దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని సంజీవ్ వర్గీయులను తరిమికొట్టారు.

దాడిచేసిన వారిపై అంబటి కృష్ణమూర్తి ఆబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. అనంతరం కొనసాగిన మీడి యా సమావేశంలో అంబటి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. తనపై సంజీవ్‌రెడ్డి అనుచర గుం డాలు చేసిన దాడి కార్మిక వర్గంపై చేసిన దాడి అన్నారు. భౌతిక దాడులతో కార్మికులపై పెత్తనం చేయాలనుకుంటే అది సాధ్యం కాదని హెచ్చరించారు. తనపై జరిగిన దా డిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గతంలో జరిగిన ఐఎన్టీయూసీ జాతీయ మహాసభలు, కార్యకలాపాల గురించి తెలియకున్నా, యూ నియన్ చరిత్రపై అవగాహన లేకున్నా ఐఎన్టీయూసీ నేతగా చెప్పుకుంటున్న బీ జనక్ ప్రసాద్ బృందం తనపై అవినీతి ఆరోపణలు చేయడం, జీ సంజీవ్‌రెడ్డి అనుచరులు భౌతిక దాడులకు పాల్పడటం గర్హనీయమన్నారు. ఐఎన్టీయూసీ నేతలుగా చెప్పుకుం టున్న ఊసరవెళ్లి జనక్ ప్రసాద్ బృందం చేసిన నిరాధారమైన, అసత్య ఆరోపణలను ఖండిస్తున్నామ ని, ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

లేదంటే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2010లో జార్ఘండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన ఐఎన్టీయూసీ జాతీయ మహాసభలో దాదాపు 20 వేల మంది ప్రతినిధులు, జనరల్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ చంద్రశేఖర్ దూబే ఆధ్వర్యంలో తనను జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అంబటి కృష్ణమూర్తి తెలిపారు. మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఐఎన్టీయూసీ జాతీయ కార్యవర్గం ఎన్నిక చెల్లదని 2010 డిసెంబర్‌లో సంజీవ్‌రెడ్డి ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేయగా, విచారణలో ఆయన ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపనందున 2014లో కేసును కొట్టివేసిందని చెప్పారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు తాను సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వారి పక్షాన పోరాడుతున్నానని చెప్పారు. ఇప్పటి వరకు తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని చెప్పారు. తమ ఐఎన్టీయూసీ (ఆర్‌తో జీ సంజీవ్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జాతీయ కార్యదర్శి బీ అమర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ నాగరాజు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్యగౌడ్, రాష్ట్ర నాయకులు అప్పారావు, గురువారెడ్డి, కృష్ణాగౌడ్, లలిత, అరుణ పాల్గొన్నారు.