calender_icon.png 20 May, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు

20-05-2025 02:11:53 AM

  1. గుల్జార్‌హౌస్ ఘటన బాధాకరం 
  2. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ప్రజా స్వామ్య దేశంలో రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకునే హక్కు ఉంటుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరుగుతుందని మీడియా అడిగిన ప్రశ్నకు వీహెచ్ పైవిధంగా స్పందించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నదన్నారు. కాగా పాతబస్తీలో గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాద ఘటన బాధాకరమన్నారు.

అగ్ని ప్రమాద ఘటనను కొందరు నాయకులు రాజకీయం చేయడం సరికాదన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించారని తెలిపారు. దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారని వీహెచ్ పేర్కొన్నారు. సోమాజిగూడలో నిర్వహించే రాజీవ్‌గాంధీ 34వ వర్ధంతికి పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరుకావాలని ఆయన కోరారు.