calender_icon.png 9 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందశాతం ఫలితాలు సాధించాలి

09-12-2025 01:47:22 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, డిసెంబర్ 8: పదవ తరగతిలో వందశాతం ఫలితాలు సాధించాలని గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సోమవారం నగరంలోని పోలీస్ లైన్ ఉన్నత పాఠశాల, ఎదిర ఉన్నత పాఠశాల, ఏనుగోండ ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు తన స్వంత నిధులతో ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను  ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పంపిణీ చేశారు. 

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ క్యూఆర్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ తో విద్యార్థులు ఎప్పుడైనా స్కాన్ చేసి చదువుకోగలిగేలా పాఠ్యాంశాలు, వీడియో పాఠాలు, ప్రాక్టీస్ బిట్స్ వంటి డిజిటల్ కంటెంట్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా  సొంత రాష్ట్రంలో కూడా  మహబూబ్ నగర్ను వెనక్కి నెట్టివేశారని, ముఖ్యంగా విద్య, వైద్య రంగాలను బీఆర్‌ఎస్ పాలనలో పూర్తిగా ధ్వంసం చేశారని  మండిపడ్డారు.

ముఖ్యమంత్రి ని ఒప్పించి ఉమ్మడి జిల్లా విద్యార్థుల కోసం మహబూబ్ నగర్కు  ఐఐఐటి కళాశాలను  తెచ్చామని,  మన జిల్లాలో ఉన్న ఐఐఐటి కళాశాలలో మన ఉమ్మడి జిల్లా  విద్యార్థులే అధిక శాతం ప్రవేశాలు పొందాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు   కార్పొరేట్ స్థాయిలో  విద్యా అవకాశాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

అందులో భాగంగా  ఆధునిక డిజిటల్ వనరులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని,  ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే డిజిటల్ బోర్డులను కూడా  ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు.  రానున్న రోజుల్లో ఇంకా అనేక విద్యా కార్యక్రమాలను  చేపడతామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,  మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా పాషా, రాషెద్ ఖాన్, మహ్మద్ మోసిన్, యాదమ్మ , నాయకులు సిహెచ్ మంజుల,  వెంకటేష్ గౌడ్, కొత్త కిరణ్, రామస్వామి, మురళి గౌడ్, చంద్రకాంత్,  గోపాల్, చర్ల శ్రీనివాసులు,గ్యాస్ అంజి, ఎరుకలి నర్సింహులు, ఎల్లయ్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.