09-12-2025 01:46:01 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, డిసెంబర్ 8: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కల్వకుర్తి మండలం గుండూర్ , ముకురాల, ఎల్లికల్ గ్రామాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొని మాట్లాడారు. ప్రజల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లగలిగే నాయకుడిని ఎన్నుకోవడం అత్యంత ముఖ్యమన్నారు.
సరైన నాయకుడు ఉంటే ప్రజలకు అన్ని విధాలా మేలు జరుగుతుందని ప్రలోభాలకు లొంగి అసమర్థులను ఎన్నుకుంటే గ్రామాలు ఐదేళ్లు వెనుక బడతా యన్నా రు.అభివృద్ధి పనులతో పాటు సంక్షేమం, నిధుల సమీకరణ, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన నాయకత్వంపై ఆధారపడి ఉంటాయని గుర్తు చేశారు. గ్రామస్థులు వివేకంతో ఓటు హక్కును వినియోగించి, అభివృద్ధి దిశగా నడిపించే నాయకులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.