16-08-2024 01:28:08 AM
పెద్దపల్లి, ఆగస్టు ౧౫ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్‌లోని ఆదివరాహస్వామి జయంత్యుత్సవాలకు హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్ర మలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు గురువారం ఆలయ ఈవో కాంతారెడ్డి, అర్చకుడు వరప్రసాద్ చార్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. శుక్రవారం నుంచి జయంతి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. తప్పనిసరిగా జయం త్యుత్స వాలకు హాజరవుతానని మంత్రి శ్రీధర్‌బాబు వారికి చెప్పారు.