calender_icon.png 19 November, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘టీచర్లు లేక విద్యార్థులకు ఇబ్బంది’

16-08-2024 01:26:42 AM

సిద్దిపేట, ఆగస్టు 15 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నారాయ ణరావుపేట మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయులు తక్కువగా ఉండటంతో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందని, మరో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని బీజేపీ మండల శాఖ అధ్యక్షు డు పొన్నాల బాబు పేర్కొన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి జిల్లెల్ల రమేశ్‌గౌడ్‌తో కలిసి గురువారం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.  విద్యార్థులు అధికంగా ఉన్నచోట ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని కోరారు.