20-11-2025 12:06:53 AM
మోవా లడ్డూల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్, నవంబర్ 19 (విజయక్రాం తి): అటవీ ప్రాంతంలో లభించే ఇప్ప పువ్వులతో తయారు చేసే మోవా (ఇప్పపువ్వు) లడ్డూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. ఉట్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మోవా లడ్డూల తయారీ, విక్రయ కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వాహకురాలు జైనూర్ ఎఎంసీ డైరెక్టర్ తొడసం రాధాభాయ్ ఎమ్మెల్యే కు లడ్డూ తినిపించారు.
మహిళా ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ కేంద్రాన్ని ఉట్నూర్ పరిసర ప్రాంత ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.. అక్కడ ఉన్న లడ్డులు, పచ్చడ్లు, ఐటిడిఎ ద్వారా తయారు చేయబడే సరుకులను పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు ఈ లడ్డూ లు ఎంతో ఉపయోగకరమైనవని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.