20-11-2025 12:08:10 AM
హైదరాబాద్/ఆసిఫాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో చలి వణికిస్తోం ది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశముందని పే ర్కొంది. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 7.9 డిగ్రీలు, ఆది లాబాద్ భజర్హత్‌నూర్‌లో 8.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.