16-05-2025 01:29:18 AM
-బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. తేమ, తరుగు పేరుతో రైతులను నిలువునా దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు ఐకేపీని కాదని, పీఏసీఎస్ సెంటర్లకు ఇవ్వడం వెనక మతలాబేంటని మహేశ్వర్‌రెడ్డి నిలదీశారు.
విషయాన్ని సంబంధిత శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులను దోపిడి చేయడమే రేవంత్‌రెడ్డి సర్కార్ లక్ష్యమా..? అని ఆయన ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.