05-01-2026 01:07:55 AM
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్/నిర్మల్, జనవరి ౪ (విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రధా న సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేయడం జరుగు తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షు లు వెడుమ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం కానాపూర్ మండలంలోని సదర్ మార్ట్ ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేశారు. యాసంగి రైతులకు నీటిని విడుదల చేయడం జరిగిందని రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. చివరి ఆయకట్టు వరకు నీటిని సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
సీఎం కప్ పోటీల ఘనంగా నిర్వహిద్దాం: ఎమ్మెల్యేలు
నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న రెండవ సీఎం కప్ పోటీలు పోటీలు ఘనంగా నిర్వహించాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు సంబంధించి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి బి. శ్రీకాంత్ రెడ్డి ఆదివారం నిర్మల్, ఖానాపూర్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్ లను వారి వారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలలో కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం కప్ పోటీల నిర్వహణ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు, డివైఎస్‌ఓను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలను కలిసిన వారిలో డివైఎస్‌ఓతో పాటు, ఎస్‌ఎఫ్జి సెక్రటరీ రవీందర్ గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు భోజన్న, ఇమ్రాన్, పోశెట్టి లు ఉన్నారు.