calender_icon.png 10 January, 2026 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన

05-01-2026 01:09:35 AM

రూ.81 కోట్లతో పనులు 

నిర్మల్, జనవరి ౪ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు భవనాల సముదాయ నిర్మాణ పనులకు హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్ అడ్మినిస్ట్రేషన్ జస్టిస్ సృజన మరో జస్టిస్ నర్సింగ్‌రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. సారంగాపూర్ మండలం చించోలి మహిళా ప్రాంగణంలో 6.20 ఎకరాల్లో రూ 81 కోట్లతో టెన్ ప్లస్ టు భవన సముదాయ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు వెల్లడించారు.

. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజలకు సత్వర న్యాయం అందించాలన్న ఉద్దేశంతో కొత్త కోర్టు భవన సముదాయాల నిర్మాణం చేపడుతున్నట్టు వారు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికి 8 చోట్ల ఈ పనులు ప్రారంభమయ్యాయని ఈ భవనాలు నిర్మా ణం అయితే న్యాయమూర్తులకు న్యాయవాదులకు కక్షిదారులకు ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. భారత రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ ఎంతో కీలకమని సత్వర న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు పనిచేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. 

నిర్మల్ జిల్లాలో కోర్టు భవన నిర్మాణ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు వేరే వేరే కోర్టులు వేరువేరుగా ఉండ టంవల్ల పడుతున్న ఇబ్బందులను దూరం చేసేందుకు కోర్టు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు రెండేళ్లలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ఆ బాధ్యతను కలెక్టర్ జిల్లా జడ్జి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా జడ్జి శ్రీవాణి, ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ ఎస్పీలు సాయికుమార్, ఉపేందర్ రెడ్డి,  బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.