calender_icon.png 13 August, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిరోజు గుడ్డు మంచిదేనా?

31-08-2024 12:00:00 AM

చాలామంది గుడ్లను బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు లంచ్, డిన్నర్‌లో కూడా తీసుకుంటారు. వాటిలో పోషకాలు అధికంగా ఉండటమే అందుకు కారణం. అయితే వండటం సులభం కాబట్టి ప్రతిరోజూ తినడానికి ఇష్టం చూపుతారు. చాలామంది ఉడకబెట్టిన వాటిని ఎక్కువగా తీసుకుంటారు. అయితే గుడ్లు డైట్ ఫేవరెట్ కావడంతో లెక్కకు మించి ఎక్కువగా తింటారు. అయితే రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? అనే సందేహాలున్నాయి. అయితే రోజూ గుడ్లు తినేటప్పుడు మితంగా తీసుకోవాలి. అంటే రోజుకు 1 లేదా 2 గుడ్లు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మితంగా తీసుకోవడం వల్ల శరీరాన్ని కొలెస్ట్రాల్, ఇతర హానికర పదార్థాలను ఓవర్ లోడ్ అవ్వకుండా చేస్తాయి. గుడ్లు అతిగా తింటే మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. అధిక కేలరీలు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. కాబట్టి రోజుకు 1 లేదా 2 తినొచ్చు. అయితే ఒక్కొక్కరి ఆరోగ్యం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి అలాంటివాళ్లు డాక్టర్లను సంప్రదించి గుడ్లను తినొచ్చు.