12-09-2025 12:00:00 AM
పోతుగల్ రైతులకే ఇవ్వాలని డిమాండ్
మాకు ఇవ్వాలని ఇతర గ్రామాల రైతులు
సముదాయించిన స్థానిక ఎస్సై గణేష్
ముస్తాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబా ద్ మండలం. పోతుగల్ గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో 440 యూరియా సం చులు పోతుగల్ కు రావడం జరిగింది. హనుమాన్ పాత రైస్ మిల్ లో యూరియా సంచులు రైతులకు పంపిణీ చేయడానికి నిర్ణయించగా ముందే రైస్ మిల్ వద్ద ఉదయం నుండి యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు వచ్చి వరుసలో వేచి యున్నారు.
ఈ విషయం తెలియగానే మండలంలోని ఇతర గ్రామాల నుండి రైతులు యూరియా కోసం రావడంతో ముందుగా మా ఊరి రైతులకే యూరియా ఇవ్వాలని ఇతర గ్రామాల వారి కి ఇవ్వొద్దని పోతుగల్ గ్రామ రైతులు నిర్వాహకులతో డిమాండ్ చేశారు.దింతో ఇరువు రి రైతుల మధ్య వాదన జరిగింది.పరిస్థితి చల్లబడే వరకు మహిళా సంఘం సభ్యులు గేటు తాళం తీయలేదు.
సమాచారం తెలుసుకున్న ఎస్త్స్ర గణేష్ తమ సిబ్బందితో సంఘ టన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. తీసుకున్న వారే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారని రానివారికి మొత్తం రాలేదని రైతులు ధ్వజమెత్తారు.ఆధార్ కార్డు పై ఒకే సంచి ఇవ్వడం మూలాన ఎక్కువ పొ లం ఉన్నవారు వరుసలో నిలబడి తీసుకోవడం జరుగుతుందని కొంతమంది రైతులు పేర్కొన్నారు.
యూరియా సంచులు సమయానికి రాక సరిపడ లేకనే ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుంద రైతులు మండిపడ్డారు.మీ మీ గ్రామాలకు తప్పకుండా లోడ్ పంపిస్తామని వ్యవసాయ అధికారి దుర్గరాజు నచ్చ జెప్పడంతో ఇతర గ్రామాల నుండి వచ్చిన రైతులు అక్కడి నుండి వెళ్లిపోయారు.
వ్యవసాయ అధికారి దుర్గారాజు ను వివరణ కోరగా..
ప్రతి గ్రామానికి యూరియా సంచులు వస్తాయని ఎవరు ఆందోళన చేయవద్దని, మీ మీ గ్రామాలకు లోడు తప్పకుండ పంపిస్తామని ఇతర గ్రామాల నుండి వచ్చిన రైతు లకు తెలిపినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన వారికే మళ్లీ మళ్లీ ఇస్తున్నారని అనుమానాలు వ్య క్తం అవుతుండడంతో ఏ గ్రామాల వారికి ఆ గ్రామాలలోనే యూరియా ఇస్తామని సమాచారం ఇచ్చామన్నారు. అందుచేత ఈ రోజు పోతుగల్ గ్రామ రైతులకు అలాగే గ్రామ పరిసరాలలో ఉన్న గన్నెవారిపల్లె, కోదాటివారి పల్లె రైతులకు పంపిణి చేయడం జరుగుతుందని తెలిపారు.