01-08-2025 12:13:39 AM
నాగారం: నాగారం మండల కేంద్రంలో ధర్మ సమాజు పార్టీ మండల కన్వీనర్ చిప్పలపల్లి నాగార్జున మాట్లాడుతూ నాగారం మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమం చేశారు .కానీ అందులో నిరుపేదలైనటువంటి పేదలకు కాకుండా పట్టణాలలో వ్యాపారాలు మరియు ఇండ్లు ఉన్నవాళ్లకి ,భూములు ఉన్నవాళ్లకి కేటాయించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు కమిటీల పేరుతో అధికారులు వచ్చి సర్వే చేసినట్లుగా నమ్మపలకి పేదలకు అన్యాయం చేశారు.
గ్రామాల్లో తిరిగే చోట మోట నాయకులు వాళ్ల కుటుంబాలకు మరియు వాళ్లకు అనుకూలంగా తిరిగే వ్యక్తులకు మాత్రమే ఇండ్లను కేటాయించడం జరిగింది. అందుకే అసలైన నిరుపేదల పక్షాన పోరాటం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ ముందుంటుంది. రాబోవు రోజుల్లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి నాయకులకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని , అధికారులు కూడా నాయకులకు భయపడి పేదలకు అన్యాయం చేస్తున్నారు. గ్రీవెన్స్ డే లో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది అని అన్నారు.