calender_icon.png 9 July, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ మీ జాగీరు కాదు?

09-07-2025 01:12:50 AM

  1. కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే దమ్ములేదు 
  2. కేటీఆర్‌పై ఎమ్మెల్సీ అద్దంకి ధ్వజం 

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): తెలంగాణ మీ జాగీరా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్సీఅద్దం కి దయాకర్ ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేని దద్దమ్మలు బీఆర్‌ఎస్ నాయకులని, రేవంత్‌రెడ్డి పేరు చెప్తే వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను పాతాళానికి తొ క్కింది రేవంత్‌రెడ్డి అన్న విషయం కేటీఆర్ మర్చిపోవద్దని హెచ్చరించారు.

మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, రామ్మోహన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. లక్ష కోట్లు దోచుకున్న దొంగ లు.. అవినీతి సంపాదనతో ఎగిరెగిరి పడుతున్నారని, బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ద్రోహు లు అన్నారు. సొంత చెల్లె ఫోన్ ట్యాప్ చేసిన నీచ చరిత్ర కేటీఆర్‌దని విమర్శించారు. తెలంగాణను దోచుకున్న మీరు జైలుకు వెళ్లక తప్పదని దయాకర్ హెచ్చరించారు.

కేసీఆర్ అసెం బ్లీకి రాకుండా  కేటీఆర్‌ను పంపిస్తున్నాడని, రేవంత్‌రెడ్డి వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటుగా విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే కాంగ్రెస్ వం ద సీట్లు గెలిచేదన్నారు. అధికారం కోసం తె లంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని, మీడియాను విడగొట్టేందుకు బీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని అద్దంకి ఆరోపించారు.

అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చుట్టూ ఆంధ్రా వాళ్లే ఉన్నారని, రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ చెప్పలే దా అని నిలదీశారు. కేటీఆర్, కేసీఆర్‌ది రేవంత్‌రెడ్డి స్థాయికాదని, దేశంలోనే రేవంత్‌రెడ్డి పాలనపై చర్చ జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన చర్రిత కేసీఆర్‌ది అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి విమర్శిచారు. హరీశ్‌రావు, కేటీఆర్‌లు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.