09-07-2025 12:50:09 AM
కంటోన్మెంట్‌కు కేంద్రం కానుక
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొర వతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం రూ. 303 కోట్లు వెచ్చించేందుకు కేంద్రం అంగీకరించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో నిర్మించనున్న ఎలివే టెడ్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ భూములను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ ఎండీఏ)కు బదిలీ చేయాల్సి ఉంది.
కంటోన్మెంట్ భూములను తీసుకుని రాష్ర్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అకౌంట్‌కు భూబదిలీ పరిహారాన్ని జమ చేస్తుంది. ఇలా రాష్ర్ట ప్రభుత్వం జమ చేసే భూ బదిలీ పరిహారాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అకౌంట్‌లో కాకుండా..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు అనుబంధంగా ఒక ఎస్క్రో అకౌంట్ (ఏ పనులకైతే నిధులను జమ చేస్తారో ఆ పనులకు మాత్రమే ని ధులను ఉపయోగించుకునేలా)ను ఏ ర్పాటు చేసి నేరుగా ఆ అకౌంట్‌లో జ మ చేయడం ద్వారా సికింద్రాబాద్ కం టోన్మెంట్ పరిధిలో అభివృద్ధి పనుల ను చేపట్టడానికి ఉపయోగకరంగా ఉం టుంది.
ఇవే అంశాలను పొందుపరు స్తూ ఎస్క్రో అకౌంట్‌ను ఏర్పాటు చేసి రూ.303 కోట్ల భూ బదిలీ పరిహారా న్ని అందులో జమ చేయించాలని రక్ష ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కేం ద్రమంత్రి కిషన్‌రెడ్డి రెండుసార్లు లేఖ లు రాశారు. స్పందించిన రక్షణ శాఖ.. ఎస్క్రో అకౌంట్‌ను ఏర్పాటు చేసి ఆ నిధులను పూర్తిగా సికింద్రాబాద్ కం టోన్మెంట్ పరిధిలో ప్రజలకు మౌ లిక వసతులను మెరుగుపరచడానికి మా త్రమే ఖర్చు చేయాలని రాజ్‌నాథ్ సిం గ్ ఆదేశించారు.
రక్షణ శాఖ భూములకుగాను రాష్ర్ట ప్రభుత్వం అం దించా ల్సిన భూ బదిలీ పరిహారాన్ని ఎస్క్రో అకౌంట్‌లో జమ చేసిన వెంటనే కం టోన్మెంట్ పరిధిలో భూగర్భ మురుగునీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చే యడంతోపాటు మంచినీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధి, రిటైనింగ్ గోడల ని ర్మాణం, రహదారుల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టాలని కంటోన్మెంట్ బోర్డును రక్షణ శాఖ ఆదేశించింది. నిధుల విడుదలకు అంగీ కరించినందుకు రాజ్‌నాథ్‌సింగ్‌కు కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.