calender_icon.png 9 July, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌ది నా స్థాయి కాదు

09-07-2025 01:14:18 AM

 -ఆయన వ్యాఖ్యలపై నేను స్పందించను

- ఈ నెల 15లోగా కొత్త డీసీసీ కమిటీలు 

- జూబ్లీహిల్స్‌లో మేమే గెలుస్తాం

- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్  

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడు తున్న మాటలకు  నా స్థాయిలో స్పందించ డం సరికాదని, ఆయనది తన స్థాయి కాదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నా రు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకే ఎక్కువ సమ యం ఇస్తున్నామన్నారు. మంగళవారం ఆయ న గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్ ని ర్వహించారు.

ఈ నెల 15 తేదీలోగా కొత్త డీసీసీ కమిటీలు వస్తాయని, డీసీసీల కమిటీ కోసమే సీనియర్ నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమించామని తెలిపారు. ఏఐసీసీ అబ్జర్వర్లు కూడా త్వరలో రాష్ట్రానికి వస్తారని, ఈ నెలాఖరు వరకు అన్ని కమిటీలు పూర్తి అవుతాయన్నారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రి జర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నామని, న్యాయ నిపుణులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

ఎమ్మె ల్యే అనిరుద్‌రెడ్డి అంశంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చై ర్మన్ మల్లు రవి విచారణ చేస్తున్నారని, ఎమ్మెలీ ్స తీన్మార్ మల్లన్న కులగణ పత్రాలు తగులబెడితే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని అందుకే నిరసనలు చేస్తున్నారని తెలిపారు. ఆపరేషన్ ఆకర్ష్ లైవ్ లోనే ఉందన్నారు. మంత్రి పదవుల అంశం తన పరిధిలో లేదని, రాజకీయాల్లో ఒక్కోసారి జూనియర్లకు ముందు అవకాశాలు వస్తాయని, సీనియర్లను సైతం పార్టీ గుర్తిస్తుందన్నారు.

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో గెలుస్తం

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో తాము గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్వేల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. జూబ్లీహిల్స్‌లో పోటీ చేసేందుకు 10 మంది సమర్థులు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ హయాంలో నిర్బంధం పాలన కొనసాగిందని, తమ హ యాంలో నిర్బంధాలు లేనందునే కవిత ధర్నా లు చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై మాట్లాడితే అరెస్ట్‌లు చేశారని, కాళేశ్వరం వద్దకు వెళదాం అనుకుంటే నిర్బంధించారని తెలిపారు. యూరియా కరువు అంటూ  బీఆర్ ఎస్‌నేతలు అబద్దాలు చెబుతున్నారని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు.