calender_icon.png 16 August, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితులను తొక్కడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమా?

13-08-2025 12:44:32 AM

  1. కొమ్ము విజయ్ పై దాడిని ఖండిస్తున్నాం

తెలంగాణ దళిత పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దబ్బేట శ్రీనివాస్

సిద్దిపేట, ఆగస్ట్ 12(విజయక్రాంతి): దళితుల ఎదుగుదల ను ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తుంకుంటా నర్సారెడ్డి జిల్లా ఎస్ సి సెల్ అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ పై దాడి చేశారని, దాడి ని తీవ్రంగా ఖండింస్తున్నామని తెలంగాణ దళిత పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దబ్బేటశ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 

3 న గజ్వేల్ లో రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ పై గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంటా నర్సారెడ్డి ఆయన అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని మండి పడ్డారు. జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్  దళితులపై దాడి చేస్తే చూస్తూ కూర్చోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులను రాజకీయంగా తొక్కడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ దాడిపై దృష్టి సారించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని, వెంటనే తూముకుంట నర్సారెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల న్నారు. లేని యెడల దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రొమాల బాబు, పెద్దమాతరి బాబు, బాకురి అశోక్, డప్పు చంద్రం, ఆనంద్, రజినీకాంత్, ఉపేందర్, వెంకటరమణ, భూపతి, శివ  పాల్గొన్నారు.