calender_icon.png 24 November, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెబల్ సాబ్ సాంగ్ ఆగయా!

24-11-2025 01:05:42 AM

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న చిత్రం ‘రాజా సాబ్‘. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా మేకర్స్ రూపొందిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికలుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. జనవరి 9న విడుదల కానున్న చిత్రానికి సంబంధించి సంగీతపరమైన అప్‌డేట్స్ వరుసగా వస్తున్నాయి.

దీనిలో భాగంగా మేకర్స్ ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. చిత్రం నుంచి ‘రెబల్ సాబ్’ పేరిట పాటన విడుదల చేసింది. కార్యక్రమంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ..- ‘సినిమా విడుదల కోసం మీ కంటే ఎక్కువగా మేము ఎదురుచూస్తున్నాం. జనవరి 9న సినిమా వస్తుందా లేదా అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. కానీ ఖచ్చితంగా జనవరి 9న మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నాం.

గ్లోబల్ గా అత్యధిక థియేటర్స్ లో లార్జెస్ట్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాం. ఫస్ట్ డే అన్ని బాక్సాఫీస్ రికార్డులను మా సినిమా అధిగమిస్తుంది’ అని ధీమా వ్యక్తంచేశారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ - ‘మీ ముఖాల్లో ఈ నవ్వు చూడటం కోసమే కష్టపడుతున్నాం. మా టీమ్ అంతా పడేది మామూలు కష్టం కాదు. ఈ సినిమాతో పండక్కి మీరంతా కాలర్ ఎగరేసుకుంటారు అని చెప్పను.

ఎందుకంటే ఈ సినిమాకు ప్రభాస్ గారి కటౌట్ కు అది చాలా చిన్న మాట. మీ మనసుల్లోకి రెబల్ గాడ్ అని ఎలా వచ్చిందో తెలియదు. కానీ నేనిప్పుడు ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా. చిన్న కాలేజ్ లో చదివేవాడిని, అలాంటిది ఆయన నీకు టాలెంట్ ఉంది రమ్మంటూ తన యూనివర్సిటీలోకి అహ్వానించారు. ప్రభాస్‌ది కల్మషం లేని మనస్తత్వం, ప్రేమతోనే అందరినీ దగ్గర చేసుకుంటాడు’ అంటూ ప్రభాస్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు.