calender_icon.png 23 November, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనతా బార్‌లో సందడి

23-11-2025 01:07:34 AM

ప్రముఖ కథానాయిక రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘జనతాబార్’. ఈ చిత్రాన్ని రోచి మూవీస్ పతాకంపై రమణ మొగిలి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణానంతర పనులకు సంబంధించి తుదిమెరుగులు అద్దుకుంటున్న. ఈ సినిమా ఈ నెల 28న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సందర్బంగా దర్శక, నిర్మాత రమణ మొగలి మాట్లాడుతూ.. “క్రీడారంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ రంగంలోని ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న లైంగిక వేధింపులకు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది. ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి పాత్ర ఎంతో శక్తిమంతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం.

సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా, మహిళల్లో చైతన్యం నింపేలా ఉంటుందీ సినిమా. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించాడు. తప్పకుండా ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.

అమన్ ప్రీతిసింగ్, దీక్ష పంత్, అనూప్ సోని, ప్రదీప్ రావత్, సురేశ్ భూపాల్ తదితరులు ముఖ్యతారాగణంగా ఉన్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యజమాన్య; పాటలు: రాంబాబు గోసాల, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీనివాస్ తేజ; సినీమాటోగ్రఫీ: చిట్టిబాబు; రచన: రాజేంద్ర భరద్వాజ్.