29-08-2025 02:39:20 AM
కొత్తపల్లి, ఆగస్ట్28(విజయక్రాంతి): గణపతి హోమాన్ని చేసిన వారికి సకల శుభాలు జరుగుతాయని ముఖ్యంగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి అన్నారు. సతీమణితో కలిసి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ బాలుర కళాశాలలో శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం గణపతి హోమాన్ని వైభవంగా నిర్వహించారు.విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ గణనాధుని సేవలో తరించిన వారికి ఎటువంటి సందేహం లేకుండా విజయాలు సాధిస్తారని, గణనాధుని కొలిచిన వారికి అన్ని విధాలుగా శ్రేయస్కరమని తెలుపుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకొని సమాజాభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు.