29-08-2025 02:45:58 AM
* జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు
* శిక్షలతోనే సమాజంలో మార్పు
* అధికారులను , పిపి,సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 28 (విజయక్రాంతి): హత్యకు కారణమైన నిందుతుడీకి జీవిత ఖైదు, 1000/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ గురువారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు.పోలీస్ ల వివరాల మేరకు.ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సిర్రం మహేష్ s/o రాజారామ్ అనే వ్యక్తి వేములవాడలో కిరాయికి ఉంటూ కూలి చేసుకుంటూన్నాడు,
అతనికి దర్ర తిరుపతితో పరిచయం ఏర్పడి తన రూమ్ లో ఉంచుకొనగా దర్ర తిరుపతి మద్యంకు బానిస అయ్యి, రూమ్ రెంట్ ఇవ్వకుండా సిర్రం మహేష్ ని వేధించగా,సిర్రం మహేష్ రెంట్ కట్టి,మద్యం త్రాగకుండా ఉంటేనే రూoలో ఉండు లేదంటే రూమ్ నుండి బయటకు వెళ్లగొడుతానని అందరి ముందు అన్నందుకు,దర్ర తిరుపతి అందరి ముందు నా పరువు తీసిన మహేష్ ను ఎలాగైనా చంపాలనే ఉద్దేశ్యంతో 1-ఏప్రిల్ -2024 రోజున రూమ్ లో సిర్రం మహేష్ పడుకున్న సమయంలో దర్ర తిరుపతి పెద్ద సిమెంట్ రాయి తో మహేష్ తల పై భాది చంపాడు.
ఈ కేసులో మహేష్ భార్య అయినటువంటి పద్మ ఫిర్యాదు మేరకు అప్పటి వేములవాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రిమాండ్ కు పంపించడం జరిగింది.తరువాత సిఐ వీరప్రసాద్ కేసు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు మానిటరింగ్ ఎస్త్స్ర రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ మహేందర్,సి ఎం ఎస్ కానిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 17 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు
కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడైన దర్ర తిరుపతికి జీవిత ఖైదీతో పాటు1000/- రూపాయల జరిమానా విధించడం జరి గింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని, శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు, ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూ చించారు.
పైకేసులో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి విచారణ అధికారి సీఐ వీరప్రసాద్, ప్రస్తుత సి.ఐ వీరప్రసాద్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్,కోర్టు మానిటరింగ్ ఎస్త్స్ర రవీంద్ర నాయుడు,కోర్టు కానిస్టేబుల్ మహేందర్,సి ఎం ఎస్ కానిస్టేబుల్ నవీన్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.