calender_icon.png 29 November, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీల మధ్య ‘పంచాయతీ’ లేదు?

29-11-2025 12:33:15 AM

  1. ఏకగ్రీవం దిశగా.. 

ఒక్కటవుతున్న పార్టీలు 

మహబూబాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం చాలాచోట్ల ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీ సింబల్ పై ఎన్నికలు జరగకపోతుండడంతో పార్టీల నేతలు పం చాయతీ ఎన్నికల్లో ఒక్కటిగా మారి పదవులను పంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దీని తో పార్టీల నేతల మధ్య ‘పంచాయతీ’ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్పం చ్ పదవి ఒక పార్టీ తీసుకుంటే, ఉపసర్పంచ్ పదవి మరో పార్టీ తీసుకుంటూ వార్డు సభ్యుల పదవులను ఇతర పార్టీలకు ఒకటి రెండు చొప్పున కేటాయిస్తూ ఏకగ్రీవ ఎన్నికకు పావులు కదుపుతున్నారు.

ఉమ్మడి వ రంగల్ జిల్లాలో పలుచోట్ల ఈ రకంగా పా ర్టీల నాయకులు ‘సంగటితం’గా మారి పం చాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ గుర్తులపై ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల , పార్టీలకు బలాబలాలు నిరూపించుకునే పరిస్థితి లేకపోవడంతో బలమున్నచోట సర్పంచ్, బలం లేని చోట ఉపసర్పంచ్ పదవులను తీసుకుంటూ రాజకీయంగా నిలబడే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

మరి కొన్నిచోట్ల గ్రామాభివృద్ధి కోసం కొం త డబ్బు లేదంటే గుడి, బడి నిర్మాణానికి స్థలం కేటాయించడం లాంటి కార్యక్రమాల కు ముందుకు వచ్చేవారిని సర్పంచ్ గా ఎ న్నుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనగామ జిల్లాలో ఇదే తరహాలో తరిగొప్పుల మండలం మా న్సింగ్ తండాలో కనకదుర్గమ్మ గుడి నిర్మాణానికి స్థలంతో పాటు 10 లక్షల రూపాయ లు ఇస్తానని ప్రకటించిన వ్యక్తిని ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకోవడానికి గ్రామస్తులు నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది.

ఇదే తరహాలో మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాత తండాలో కూడా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీల నేతలు సమైక్యంగా నిలిచి సర్పంచి పదవిని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తికి, ఉప సర్పంచ్ పదవి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వ్యక్తికి ఏకగ్రీవంగా కట్టబెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆ యా గ్రామాల్లో ఇప్పటికే సూత్రప్రాయంగా ఏకగ్రీవ ఎన్నికకు అంగీకరించి, విజయోత్సవాలను కూడా నిర్వహించడం జరిగింది. ఈ తరహా ఏకగ్రీవ ఎన్నికలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు పంచాయతీల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏకగ్రీవ ఎన్నికల కోసం ప్రయత్నాలు జరుగుతున్న పంచాయతీల్లో ముందుగా తీర్మానించుకున్న అభ్యర్థు లు మాత్రమే ఎన్నికల భరిలో నిలిచే విధం గా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయిత పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా డిసెంబర్ 3న పోటీ చేసే అభ్యర్థుల ఉపసంహరణ అ నంతరం మాత్రమే మొదటి దశ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్, వార్డు స భ్యుల అధికారిక ప్రకటన వెలువడనుంది.